నులి పురుగుల నివారణ
మొక్కల పై లక్షణాలు:
- ఇవి ఆశించిన చెట్ల ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం, కొమ్మలు ఎండి పోవడం, తక్కువ దిగుబడి ఇవ్వడం, మొక్కలు మెత్తగా అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి, ఆశించిన మొక్కల వేర్లపై బుడిపెలు ఏర్పడుతాయి.
- నులి పురుగుల ఉదృతి బట్టి బుడిపెల యొక్క పరిమాణం ఉంటుంది.
- నులి పురుగుల తీవ్రత ఎక్కువ ఉన్నట్లయితే, వేర్లు కుళ్లిపోతాయి మరియు వేర్లపై బుడిపెల సమ్మేళనను గమనించవచ్చు.
నులి పురుగుల నివారణ నివారణ:
- వేసవి లో దున్నుట: వేడి వేసవి నెలల్లో రెండు మూడు సార్లు లోతుగ దున్నడం వలన కలుపు మొక్కలు, కీటకాలు, శిలీంధ్రాలతో పాటు నులి పురుగులు ఉన్నట్లయితే చనిపోతాయి.
- శుభ్రమైన మరియు నులి పురుగులు ఆశించని మొక్కలను నాటడం కోసం ఎంచుకోవాలి. మొక్కలను నాటడానికి ఉపయోగించే ముందు నులి పురుగులు సంక్రమణ కోసం పరీక్షించాలి.
- పండ్ల తోటల నుండి నులి పురుగులు సోకిన చెట్లను తొలగించలి.
- నులి పురుగులు సోకిన నేల కదలికను వ్యాధి సోకని ప్రాంతాలకు పాకకుండా నివారించలి.
- పంట మార్పిడి చేయాలి : ఉదాహరణకు తృణధాన్యాలు వేసినట్లయితే ఆ పంటని మరల కూరగాయపంటలతో మార్పిడి చేయాలి. దానివలన నులి పురుగు బెడద తగ్గుతుంది.
- పంట కోత అనంతరం వాటి వేర్లను ధ్వంసం చేయాలి అంటే పంట కాలం తరువాత భూమి యొక్క ఉపరితలాన్ని కాల్చాలి.
- బంతిని అంతరపంటగా వేసుకోవాలి ఆలా చేయడం ద్వారా నులిపురుగులు సాంద్రతను తగ్గిస్తుంది.
- పొలాన్ని చాల శుభ్రంగా ఎటువంటి కలుపు కానీ ఇతర అనవసర మొక్కలు కానీ ఉండకుండా చూసుకోవాలి.
- రెండు లేదా మూడు సంవత్సరం ఉన్న పండ్ల మొక్కలు ఉన్నట్లయితే నిమిట్జ్ (NIMITZ) అనే మందును 40gm చొప్పున ఒక్కొక్క మొక్కకి వేయాలి.
- అదే మూడు సంవత్సరాలు పైబడి ఉన్న మొక్కలకు నిమిట్జ్ (NIMITZ) అనే మందును 60gm చొప్పున ఒక్కొక్క మొక్కకి వేయాలి.
- రసాయన మందు వేసే విధానం: మొక్కకు చుట్టూ 3-4 cm దూరం లో గుంటని త్రవ్వి అందులో పై చెప్పిన నిమిట్జ్ (NIMITZ)అనే మందును వేసుకోవాలి వేసిన అనంతరం నీళ్లను వేయాలి ఆలా చేయడం ద్వారా ఆ యొక్క మందు భూమి లోకి ఇంకుతుంది.
- నిమిట్జ్ (NIMITZ) దొరకని పక్షం లో ప్రతి మొక్కకు 50గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను 1 కి. మట్టితో కలిపి బెరడు చుట్టూ వేసుకోవాలి. 15 రోజుల తరువాత, ప్రతి మొక్కకు, 500 గ్రా. వేప పిండి లో 20 గ్రా. ట్రైకోడెర్మా విరిడి, 20 మి. సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ మరియు 10 గ్రా. పెసిలోమైసెస్ లీలసినస్ ను కలిపి వేసుకోవాలి (100:2:2:1).
- వేపపిండి ఖరీదు ఎక్కువగా ఉండడం మరియు ఎక్కువ మోతాదులో వాడాల్సి ఉంటుంది కనుక 50 kg ల వేపపిండిని 01 టన్ను పశువుల పెంట లో కలిపి ఈ మిశ్రమం లో 2 KG ట్రికోడెర్మా మరియు 2 KG సూడోమోనాస్ ను కలిపి ఒక్కొక్క మొక్కకి 20-30 KG చొప్పున వేసుకోవాలి ఆలా ప్రతి రెండునెలల కి ఒకసారి చేయడం ద్వారా నులి పురుగుల ఉద్రిక్తతను తగ్గించవచ్చు.
ధన్యవాదాలు…!!!