వంగ లో మొవ్వు మరియు కాయ తొలుచు పురుగు నివారణ
లక్షణాలు
ఈ పురుగు సుమారు 11 – 93 % నష్టం కలుగచేస్తుంది. మొక్కలు పెరిగే వయసులో మొవ్వును, తర్వాత దశలో కాయలను తొలచివేస్తుంది. కాయలు ఒక్కోసారి వంకర తిరిగి ఉంటాయి. మొవ్వు భాగం వాలిపోయి కాయలపై రంద్రాల్లో పిల్ల పురుగులు విసర్జించడాన్ని గమనించి ఈ పురుగు ఉనికిని గమనించవచ్చు. ఒక్కో పిల్లపురుగు సుమారుగా 4-5 కాయలను నష్టపరుస్తుంది. తద్వారా కాయలు అమ్మకానికి పనికిరావు.
సమగ్ర నివారణ
ఈ పురుగు ఆశించిన మొదటి దశలోనే, పురుగు ఆశించిన కొమ్మలను తుంచి పంటకు దూరంగా కాల్చివేయాలి. అంతరపంటగా కొత్తిమీరను వేసుకోవాలి. పంట మార్పిడి పద్దతి పాటించాలి. లింగాకర్షక బుట్టలను ప్రాధాన పంటలో 40 నుండి 45 /ఎకరానికి 10 మీ. ఎడంలో వెదురు కట్టెలకు అమర్చితే, తల్లి పురుగులు ఆకర్షింపబడి బుట్టలో పది చనిపోతాయి. ట్రైకోగ్రామా ఖిలోనిస్ బధనికలను పూత సమయంలో వదలినట్లైతే ఈ పురుగును నివారించవచ్చు. ట్రైకో కార్డులను 2040 గుడ్లు /ఎకరానికి ఆకుల అడుగుభాగంలో, పంటలో అక్కడక్కడా అమర్చుకోవాలి. ఇవి పెట్టినప్పుడు వేపనూనె 5 మీ.లి. లేదా బి.టి. సంబంధిత మందులను 200గ్రా /ఎకరాకు పిచికారీ చేసుకోవాలి.
రసాయన నివారణ
క్లోరాంట్రానిలిప్రోల్ 18.50%SC @0.4 మీ.లి./లీటరు నీటికి లేదా సైపర్‌మెత్రిన్ 25.00%EC @0.2-0.4 మీ.లి./లీటరు నీటికి లేదా డెల్టామెత్రిన్ 2.8%EC @1 మీ.లి./లీటరు నీటికి లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 5%SG @0.4 గ్రా./లీటరు నీటికి లేదా లాంబ్డా-సిహలోథ్రిన్ 5% EC @0.6 మీ.లి./లీటరు నీటికి లేదా స్పినోసాడ్ 45%SC @3మీ.లి./లీటరు నీటికి లేదా థతయాక్లోప్రిడ్ 21.70% SC @1.5 మీ.లి./లీటరు నీటికి లేదా థియోడికార్బ్ 75% WP @2 మీ.లి./లీటరు నీటికి లేదా సైపర్‌మెత్రిన్ 3%+క్వినాల్‌ఫోస్ 20% EC @0.6 మీ.లి./లీటరు నీటికి లేదా పైరిప్రోక్సిఫెన్ 5% + ఫెన్‌ప్రోపాథ్రిన్ 15% EC @1 మీ.లి./లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.